అరుకులోయ ప్రజల ఆభిమనంతోనే నా గేలుపు : స్వతంత్ర ఆభ్యర్ధి

61

అరకులోయ మండలంలో బుధవారం జరిగిన మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో పంచాయితీలో ప్రజలు మద్దతుతోనే సర్పంచ్ గా గెలిచాను. అని ఆ పంచాయతీ నూతన సర్పంచ్ దురియా భాస్కర్ రావు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సర్పంచ్ గా తనను గెలిపించిన పంచాయతీ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. రాజకీయ పార్టీ మద్దతు తో గెలుపొందే లేదని, ప్రజల మద్దతుతోనే విజయం సాధించనన్నారు. పంచాయతీ ప్రజలు తనపై నమ్మకంతో సర్పంచ్ గా గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పంచాయితీ ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే తనకు నేరుగా తెలియజేయాలని కోరారు. కాగా భవిష్యత్తులో ప్రజలు ఏ పార్టీకైనా మద్దతు తెలియజేయాలని కోరుతే తాను ఆ పార్టీలో చేరుతానని ఆయన స్పష్టం చేశారు.