Aruku Mp Inaugurated YSR volley Ball Tourney

424

అరకులోయలో వాలీబాల్ టోర్నీ ప్రారంభించిన అరకు ఎంపీ గోడ్డేటి.మాధవి అరకు శాసన సభ్యులు చెట్టి పాల్గుణ

విశాఖ జిల్లా అరకులోయ లో గురువారం వాలిబాల్ గ్రౌండ్ సమీపంలో అరకు శాసన సభ్యులు చెట్టి.ఫాల్గుణ వారి ఆధ్వర్యంలో వైయస్సార్ మెగా వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిరి. ఈ ప్రారంభోత్సవానికి అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ముఖ్య అతిథిగా విచ్చేసి వాలీబాల్ టోర్లమెంట్ ను ప్రారంభిచారు. ఈ టోర్లమెంట్ లో 56 జట్లు వివిధ ప్రాంతాల నుండి పాల్గొంటున్నట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన జట్లకు విడిది, మరియు భోజన సదుపాయం కల్పిస్తామని తెలియజేసారు. ఈ పోటీలు 11,12,13, మూడు రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ క్రీడా కారులకు ఉత్తేజ పరిచి,ప్రతి ఒక్క యువత క్రీడాల్లో రాణించి అంతర్జాతీయ స్థాయికీ ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ భర్త శివప్రసాద్ వైసీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శెట్టి.గంగాధర్ స్వామీ,అరుకు జెడ్పిటిసి అభ్యర్థిని శెట్టి.రోషిణి, నాయకులు కమిడి అశోక్, శెట్టి బాబురావు, రామరావు,రఘునాధ్, సుంక్ర, యాసిన్, వార్డు మెంబర్, కడలి శివ తదితరులు పాల్గొన్నారు.